భారతదేశం, సెప్టెంబర్ 29 -- గోదావరి నదిలో వరద ప్రవాహం సోమవారం సాయంత్రానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో వివిధ ప్రాంతాల్లో నీటి మట్టాలు నమోదు అవుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 36.4 అడుగులకు చేరగా, కూనవరం వద్ద 17.8 మీటర్లు, పోలవరం వద్ద 11.7 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం ప్రస్తుతం నిలకడగా ఉంది. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా 9.71 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి మరింతగా తగ్గే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అయితే. నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ...