భారతదేశం, ఏప్రిల్ 25 -- తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా పులుల సంచారం భయంపుట్టిస్తోంది. అటవీ అధికారులు వాటిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన మగ పులి గోదావరి ప్రాంత వాతావరణానికి అలవాటుపడినట్లు కనిపిస్తోంది.

జాతీయ పులి సంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 6న తూర్పు గోదావరి జిల్లాలోని కుర్మాపురం గ్రామంలో మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. ఈ పులిని ఫిబ్రవరి రెండో వారంలో పాపికొండ నేషనల్ పార్కు వైపు విడుదల చేశారు. అయితే వాగులు, వంకలు దాటుతూ.. ఆహారం కోసం వెతుకుతూ.. ఈ పులి గోదావరి నదిని దాటి మళ్లీ తూర్పు గోదావరి జిల్లాకు తిరిగి వచ్చింది. అయితే డిసెంబర్ 2025లో మహారాష్ట్రలోని తన స్వస్థలమైన తాడోబా-అంధారి టైగర్ రి...