భారతదేశం, సెప్టెంబర్ 27 -- ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. పరివాహక ప్రాంతాల్లో ప్రవాహం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. కేవలం రెండు రోజుల క్రితం భద్రాచలం వద్ద 17 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం.. ఇవాళ ఉదయానికి ఏకంగా 40 అడుగుల మార్కును దాటేసింది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద మెట్లు మెజారిటీ భాగం నీట మునిగిపోయాయి. ప్రవాహం 43 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

గోదావరి పరివాహక ప్రాంతాలైన కూనవరం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 14.8 మీటర్లకు చేరగా, పోలవరం ప్రాజెక్ట్ వద్ద 9.98 మీటర్లుగా నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి ఇన్ ...