గోదావరికి కొనసాగుతున్న వరద - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన
భారతదేశం, సెప్టెంబర్ 27 -- గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.
శనివారం రాత్రి సమయానికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. నదిలోకి వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువన ఉన్న సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో ఆదివారం(ఇవాళ) నాటికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రవాహం దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల క్యూసెక్కుల స్థాయికి చేరుకుంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అయితే, ఈ గరిష్ఠ ప్రవాహం నమోదైన అనంతరం క్రమంగా వరద ఉధృతి తగ్గు ముఖం పడుతుందని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.