Telangana,hyderabad, ఆగస్టు 1 -- రాష్ట్రంలో గొర్రెల కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారుల ఇళ్లలోనూ కూడా సోదాలు చేపట్టిన ఈడీ. కీలక ఆధారాలను సేకరించింది.

గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. తాజాగా కీలక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు తెలిపింది. మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ ఇంట్లో సోదాలు చేసినట్లు వివరించింది. 200లకు పైగా బ్యాంక్‌ పాస్‌బుక్‌లు సీజ్‌ చేశామని తెలిపింది.

సీజ్ చేసిన బ్యాంకు బ్యాంకు ఖాతాలను ఆన్ లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ లోనూ ఉపయోగించినట్లు ఈడీ పేర్కొంది. సోదాల్లో భాగంగా. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను సీజ్ చేసినట్లు తెలిపింది. పలు ఏటీఎం కార్డులను కూడా ...