భారతదేశం, జూలై 20 -- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు అత్యంత కీలకమైన 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్' (GATE 2027) పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 21 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ రోజు రెండు సెషన్ల (ఉదయం, మధ్యాహ్నం) చొప్పున దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఈ పరీక్షలు జరుగుతాయి.

గేట్ 2027 రాయాలనుకునే అభ్యర్థులు 2026 ఆగస్టు 14 నుంచి అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 21 తుది గడువుగా నిర్ణయించారు.

ఈసారి మొత్తం 30 సబ్జెక్టుల్లో (Test Papers) గేట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు సబ్జెక్టుల వరకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. పరీక్షలు కేవలం ఇంగ్లీష్ మాధ్యమ...