భారతదేశం, సెప్టెంబర్ 24 -- గూగుల్ సెర్చ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి రాగా, మరిన్ని కొత్త ఫీచర్లను గూగుల్ తీసుకురానుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెర్చ్ లైవ్. ఈ ఫీచర్ త్వరలో అమెరికా, భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు నేరుగా గూగుల్‌తో మాట్లాడి సమాధానాలు పొందవచ్చు. ఇది జెమిని లైవ్ ఫీచర్ మాదిరిగానే పనిచేస్తుంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్‌లోని కెమెరా, వాయిస్ కన్వర్జేషన్ మోడ్‌ను ఉపయోగించి గూగుల్‌తో సంభాషించవచ్చు. "ప్రజలకు సెర్చ్ మరింత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. దేని గురించి అయినా సులభంగా అడిగేలా దీనిని రూపొందించాం. ఇప్పుడు మీరు గూగుల్‌తో వెనక్కి, ముందుకూ సంభాషణ జరపవచ్చు. దీనినే మేము స...