భారతదేశం, ఆగస్టు 18 -- టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ గూగుల్ ఫ్లైట్ డీల్స్‌ను ప్రవేశపెట్టింది. ఇది బెటర్ ఫ్లైట్ టిక్కెట్ ధరలను కనుగొనడంలో సహాయపడే కీలకమైన ఫీచర్. ప్రయాణ తేదీలు, గమ్యస్థానం లేదా విమాన రకం గురించి తెలియజేస్తుంది.

గూగుల్ ఫ్లైట్ డీల్స్ ఫీచర్ చాట్‌బాట్ ఇంటర్‌ఫేస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ ప్రాధాన్యతలను తెలియజేయడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు వినియోగదారులు ఈ శీతాకాలంలో గొప్పగా ఆహారం దొరికే నగరానికి ఒక వారం పర్యటన అన్నట్టుగా ప్రాంప్ట్ ఇవ్వాలి. దీని తరువాత ఏఐ అవసరాలను అర్థం చేసుకుంటుంది, తగిన విషయాలను చెబుతుంది.

మీరు గూగుల్ ఫ్లైట్ డీల్స్‌లో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు.. అధునాతన ఏఐ వినియోగదారు అవసరాలను అర్థం చేసుకుంటుంది. రియల్ టైమ్ డేటా ఆధారంగా తగిన ఆప్షన్స్ అందిస్తుంది. ఇది ...