భారతదేశం, జనవరి 1 -- రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వందే భారత్ స్లీపర్' రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ సర్వీసును గువాహటి - కోల్‌కతా (హౌరా) మధ్య ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే 15 నుంచి 20 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి నిర్వహించిన అన్ని రకాల పరీక్షలు, ట్రయల్స్, భద్రతా తనిఖీలు విజయవంతంగా పూర్తయ్యాయని రైల్వే మంత్రి తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "వందే భారత్ చైర్ కార్ వేరియంట్‌కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అదే ఉత్సాహంతో, సుదూర ప్రయాణాల కోసం తదుపరి తరం స్ల...