భారతదేశం, జూలై 29 -- హిందూ ధర్మంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని మనం గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 29న అనగా ఈరోజు గురు పౌర్ణిమ పర్వదినం వచ్చింది.

మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. మనకు విద్యను, విచక్షణను, జీవిత సత్యాన్ని బోధించిన గురువులను స్మరించుకుని, కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన సందర్భం ఇది.

పురాణాల ప్రకారం, ఈ పవిత్ర దినాన మహర్షి వేదవ్యాసుడు జన్మించారు. మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన మహాజ్ఞాని వేదవ్యాసుడు. అందుకే ఆ మహానుభావునికి గౌరవ సూచకంగా ఈ రోజును వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. మన జీవితానికి సరైన దారి చూపిన గురువుల పట్ల భక్తి, ప్రపత్తులను చాటుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి శిష్యులు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస...