భారతదేశం, జూన్ 17 -- జ్యోతిష్య గణాంకాల ప్రకారం, గురు గ్రహం పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ యోగం సిద్ధిస్తుంది. జూన్ 18న ప్రారంభమై, ఆగస్టు 18 వరకు గురు గ్రహం వివిధ దశల్లో పుష్య నక్షత్రంలోనే సంచరిస్తుంది. ఈ కాలంలో ఏ పని మొదలు పెట్టినా, దైవ ప్రార్థనలు చేసినా అవి త్వరగా ఫలిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ధన సంపాదన, ఆస్తి వృద్ధి, శుభకార్యాల ఆరంభానికి ఇది అత్యంత అనువైన సమయం.

గురు పుష్య యోగంలో లక్ష్మీదేవిని, గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆటంకాలు తొలగిపోయి, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

జూన్ 18న పసుపు రంగు వస్త్రంలో కొన్ని పసుపు కొమ్ములను, ఒక నాణేన్ని, కొన్ని గవ్వలను ఉంచి మూట కట్టండి. ఈ మూటను మీ ఇంటి బీరువాలో లేదా ధన స్థానంలో ఉంచండి. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండి, ఏడాది పొడవునా ధనానికి లోటు ఉండదు. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తి...