భారతదేశం, సెప్టెంబర్ 20 -- జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు తాజాగా తన నక్షత్ర మార్పునకు సిద్ధమవుతున్నారు. బుధుడికి అధిపత్యం ఉన్న ఆశ్లేష నక్షత్రం తృతీయ పాదంలోకి గురువు అడుగు పెట్టనున్నారు. అక్టోబర్ 8 వరకు గురువు ఇదే నక్షత్ర పాదంలో సంచరించనున్నారు. ఈ ప్రత్యేక నక్షత్ర మార్పు కారణంగా దాదాపు ఏడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుందని ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ స్పష్టం చేస్తున్నారు. రాబోయే 18 రోజుల పాటు ఈ రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోనున్నాయి.

కర్కాటక రాశిలో ఇప్పటికే గురుడు సంచరిస్తుండగా, అదే రాశిలో నక్షత్ర మార్పు జరగడం ఈ రాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ కాలం అత్యంత శుభప...