భారతదేశం, మార్చి 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. దేవగురువు బృహస్పతి జ్ఞానం, సంపద, సంతోషం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. 2026లో గురువు సంచారం చాలా ముఖ్యమైనది. గురువు ఏడాదికి ఒకసారి సంచారంలో మార్పు చేస్తాడు.

2025లో ఒక్కసారి మాత్రమే సంచారంలో మార్పు చేసిన గురువు, ఈ ఏడాది ఐదు నెలల్లో రెండు సార్లు సంచారంలో మార్పు చేయనున్నాడు. అలాగే గురువు సంచారంలో మార్పు రావడంతో గజకేసరి రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది.

మామూలుగా చూసినట్లయితే, గురువు ఏడాదికి ఒకసారి తన సంచారంలో మార్పు చేస్తాడు. 2026లో చూసుకున్నట్లయితే, జూన్ నుంచి అక్టోబర్ దాకా రెండు సార్లు తన సంచారంలో మార్పు రాబోతోంది. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ...