భారతదేశం, జూన్ 16 -- కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అల్గనూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో ఊరూరా ఎంత అద్భుతంగా పోరాడారో తనకు తెలుసు అన్నారు. 2001లో పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచిన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం ఇది అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండమైన బలగం ఉన్న పార్టీ మన బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

'గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ జరిగిందని నేను వాస్తవాలు మాట్లాడితే, మంత్రులు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. బట్టలు, బూట్లకు 1200 కోట్లు, ఉప్పులు పప్పులు కోడిగుడ్లకు 800 కోట్ల...