భారతదేశం, సెప్టెంబర్ 22 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ గ్రహమైన గురుడు వృశ్చిక రాశిలో ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా ఈ రాశిలో ఉన్నందున నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం సెప్టెంబర్ 18న ప్రారంభమై, అక్టోబర్ 31 వరకు తన ప్రభావాన్ని చూపుతుంది. గురు, కుజ గ్రహాల కారణంగా నీచభంగ రాజయోగంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.

కుజుడు , గురుడి కలయిక వలన ఏర్పడిన నీచభంగ రాజయోగం కారణంగా ఈ సమయంలో తులారాశి వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ కాలంలో తులారాశి వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ కాలంలో గురు, కుజ గ్రహాల ప్రత్యేక అనుగ్రహంతో వ్యాపారం, వ్యవహారాలు, ధనం, సంపద, గౌరవం, కీర్తిలో అపారమైన వృద్ధిని సాధించడానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అయితే ఈ కాలంలో లభించే ఏ మంచి అవకాశాన్ని కూడా వదులుకోకుండా...