భారతదేశం, నవంబర్ 13 -- కార్ రెంటల్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కనే చిన్న, మధ్యతరహా వ్యాపారులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించనుంది! ఇప్పటివరకు సెల్ఫ్ డ్రైవ్ లేదా డ్రైవర్ ఆధారిత (ఛౌఫర్-డ్రివెన్) కార్ రెంటల్ సంస్థను ప్రారంభించాలంటే కనీసం 50 కార్లు ఉండాలనే కఠిన నిబంధన ఉండేది. తాజాగా ఆ పరిమితిని ఏకంగా 5 కార్లకు తగ్గిస్తూ కేంద్రం 'ది రెంట్-ఏ-క్యాబ్ స్కీమ్ 2026' పేరుతో కొత్త ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ఉద్యోగుల వారాంతపు ప్రయాణాల నుంచి మొదలుకొని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో పర్యాటకులు, భక్తుల అవసరాల వరకు తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే 50 కార్ల నిబంధన కారణంగా స్థానిక చిన్న ట్రావెల్ ఏజెన్సీలు, యువ పారిశ్రామికవేత్త...