భారతదేశం, నవంబర్ 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షిని టీవీ అడుగుతుంది ప్రభావతి. అది ఇవ్వడానికి ఒప్పుకుంటుంది కామాక్షి. మరోవైపు సుమతి ఫోన్ తీసుకొచ్చి మీనాకు ఇస్తుంది. కవరింగ్ నగల గురించి తెలిసింది అసలు ఏమైందని మీనాను అడుగుతుంది సుమతి.

ఇంట్లో నగలు తీసుకెళ్తే వాళ్లు కవరింగ్‌వి అన్నారు. అవి కవరింగ్ నగలు కాదని మీ బావ గట్టిగా చెప్పాడు. పెద్ద గొడవ కాదులే అని మీనా అంటుంది. మీ నగలు మీ అత్త దగ్గర ఉన్నాయి. అవే తీసుకెళ్లారు. వాటినే కవరింగ్ అంటున్నారు అంటే ఏదో జరిగింది అని సుమతి అంటుంది. అవన్నీ నీకు అవసరం లేదు. ఇది మా ఇంటి విషయం. నీకు తెలియద్దు. ఇంట్లో అమ్మకు చెప్పకు అని సుమతిని పంపించేస్తుంది మీనా.

రేపే ఊరికి వెళ్తానని సుశీల చెబితే సత్యం నిరుత్సాహపడతాడు. సత్యం, సుశీల సంతోషంగా మాట్లాడుకుంటుంటే మీనా వచ్చి వీడియో తీస్తుంద...