భారతదేశం, డిసెంబర్ 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం, ప్రభావతి మాట్లాడుకున్నాక ఇంకో కారు కొందామని, నాకు తప్పు చేసినట్లుగా ఉందని మీనా అంటుంది. దానికి సరే అన్న బాలు వాళ్లను కలుపుతానంటాడు. మరోవైపు డెలివరీ సీన్ చాలా హైలెట్ అని, చాలా ఎమోషన్‌గా చేయాలని శ్రుతికి కో ఆర్డినేటర్ చెబుతాడు. ఆ వీడియో చూసిన శ్రుతి అచ్చం అలాగే చేస్తుంది.

కో ఆర్డినేటర్ చప్పట్లు కొడతాడు. శ్రుతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజంగా చాలా ఎమోషనల్‌గా ఉందని, ఈ ఒక్క విషయంలో లేడిస్ హ్యాట్సాఫ్ చెప్పాలని బాధపడుతుంది శ్రుతి. వెంటనే తల్లికి కాల్ చేసి సారీ చెబుతుంది. నన్ను కనేటప్పుడు చాలా బాధపడి ఉంటావుగా. అందుకు సారీ చెప్పాలనిపించింది అని డబ్బింగ్ గురించి చెబుతుంది శ్రుతి.

నిజంగానే ఆ టైమ్‌లో కష్టంగా ఉంటుంది. కానీ, తల్లి కావడం అనేది ఆడదానికి దేవుడు ఇచ్చిన వరం...