భారతదేశం, జూలై 2 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింటు, సుగుణను స్కూల్‌కి మనోజ్ తన కారులో తీసుకెళ్తాడు. స్కూల్‌లో సత్యంతో బాలు, మీనా మాట్లాడుతారు. ఇవాళ పిల్లలు ఎందులో చేరాలో తల్లిదండ్రులతో మాట్లాడుతారు. అందులో హెల్ప్ చేయమని అడిగారని సత్యం చెబుతాడు.

మేము గుడికి వెళ్లి ఇటే వస్తాం. కలిసి వెళ్దామని బాలు, మీనా అంటారు. నాకోసం మీ పనులెందుకు ఆపుకుంటారు. నేను వస్తానని సత్యం అంటాడు. మనోజ్ కారులో చింటు, సుగుణ రావడం బాలు, మీనా చూస్తారు. బాలు, మీనాలను చూసిన చింటు పరుగెత్తుకుంటూ వెళ్లి పలకరిస్తాడు. సుగుణతో దత్తత ఇష్టం లేక మాతో మాట్లాడట్లేదని అర్థమైందని మీనా అంటుంది.

తర్వాత మనోజ్ కారులో రావడం గురించి అడిగితే.. జరిగింది చెబుతుంది సుగుణ. ఇవాళ పేరెంట్స్ మీటింగ్ కదా చింటు వాళ్ల అమ్మ రాలేదా ...