భారతదేశం, మే 27 -- గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మనోజ్, రవి చేసిన పనికి మీనా, రోహిణి, శృతి వాళ్లతో గొడవ పడటం లేెటెస్ట్ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో తమ భర్తలపై తిరుగుబాటు చేయడంతో అత్తమామలకు ఏం చేయాలో తోచదు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 27) ఎపిసోడ్ మలేషియా దంపతులు మీనాపై పొగడ్తల వర్షం కురిపించి వెళ్లిపోయే సీన్ తో మొదలవుతుంది. వాళ్లు వెళ్లిన తర్వాత రోహిణి ఎక్కడ అని మనోజ్ అడిగితే.. బాలు ఆమెపై సెటైర్లు వేస్తాడు. సడెన్ గా పంటి నొప్పి వచ్చి, చెంప ఇంత లావుగా వాచిపోయిందని అంటాడు. రవిలోనూ రోహిణిపై అనుమానం వస్తుంది.

మలేషియా అని చెప్పగానే ఆమెకు పంటి నొప్పి రావడమేంటో అని బాలు అంటాడు. ఆ తర్వాత రోహిణి, శృతి ఇంటికి వస్తారు. ఆమె పన్ను పుచ్చిపోయిందని, డాక్టర్ పన్ను పీకేశాడని శృతి చెబుతుంది. కాస్త మ...