భారతదేశం, ఫిబ్రవరి 25 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 627వ ఎపిసోడ్ లో అత్త ప్రభావతితో శపథం చేసి గెలుస్తుంది మీనా. ఇంట్లో జరిగే హోమానికి మౌనికను పిలవడానికి వెళ్లిన మీనా.. అక్కడ సంజూకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇటు నాలుగు జంటలతో కలిసి ఇంట్లో సంతాన హోమానికి ఏర్పాట్లు చేస్తుంటారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 25) ఎపిసోడ్ బైకుపై శృతి, నీతూలను ఎక్కించుకొని రవి వెళ్లే సీన్ తో మొదలవుతుంది. నీతూ మధ్యలో కూర్చోవడంతో శృతి ఉడుక్కుంటుంది. అతన్ని గిల్లుతూ ఉంటుంది. అప్పుడే ట్రాఫిక్ పోలీసులు వాళ్లను ఆపుతారు. ట్రిపుల్ రైడింగ్ అంటూ ఫైన్ కట్టాలని అడుగుతారు. నీతూ, రవి ఇద్దరూ పర్సు తీసుకురాకపోవడంతో చివరికి శృతియే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీతూ మాత్రం ట్రాఫిక్ పోలీసు బైక్ ఎక్కి వెళ్లిపోతుంది.

ఇటు ఇంట్లో మరోసారి తల్లి ...