భారతదేశం, జనవరి 1 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాతో ఇంకో పందెం వేస్తారు పూలు కట్టేవారు. ఫోన్ చేసి పొద్దున చేసిన బీట్ రూట్ దోశ ఎలా ఉందో అడుగు. బాగుందని చెబితే ఐదు వందలు నీకే అని వాళ్లు అంటారు. బాలుకు మీనా కాల్ చేస్తుంది. బాలు డ్రైవింగ్‌లో ఉంటాడు. దాంతో మీనా టిఫిన్ గురించి అడగ్గానే చిరాకుపడతాడు.

దాంతో మరోసారి మీనా పందెం ఓడిపోయి ఐదు వందలు ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు తినడానికి బాలు, రాజేష్ కూర్చొంటారు. బాలుకు దోశ పిండి, పల్లీలు, పచ్చి మిర్చి పెడుతుంది మీనా. అది చూసి షాక్ అవుతాడు బాలు. ఎందుకిలా పెట్టింది అని బాలు అంటే ఏమైనా గొడవ పడ్డారా అని రాజేష్ అడుగుతాడు. మీనా కాల్ చేసింది, తాను అరిచింది బాలు చెబుతాడు.

వాళ్లు వండింది ఎలా ఉందో వాళ్లకు చెబితే సంతోషిస్తారు. అది నువ్వు చేయలేదు దాని ఎఫెక్టే ఇది. ఇవాళ నీకు కాళరాత్రే అ...