భారతదేశం, నవంబర్ 17 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యవతి భర్త, సుశీల ప్రేమికుడు గోపాలంను బాలు తీసుకొస్తాడు. సుశీలను అలాగే చూస్తుంటాడు గోపాలం. సుశీల సిగ్గుపడుతుంది. చిన్నప్పుడు సుశీల, తన ఫ్రెండ్స్, గోపాలం లవ్ ట్రాక్ అంతా చెబుతుంది సత్యవతి.

సుశీల, సత్యవతి ఇద్దరు ప్రాణ స్నేహితులం అని, పెళ్లి చేసుకుంటే విడిపోతామని ఇద్దరు ఒక్కరినే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెబుతారు. అలాగే, గోపాలం తన లవ్ లెటర్‌ను సుశీల బ్యాగ్‌లో పెట్టబోయి సత్యవతి బ్యాగ్‌లో పెట్టడంతో పెళ్లి అయిందని చెబుతాడు గోపాలం. సుశీలను లవ్ చేసినట్లు శోభనం గదిలో చెప్పాడు. దాంతో పదేళ్లు మాకు శోభనమే జరగలేదని సత్యవతి చెబుతుంది.

అంతా నవ్వుకుంటారు. సడెన్‌గా సుశీల కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంతా అడిగితే ఏం లేదు. నా మనవడు నా బాల్యాన్ని దోసిట్లో తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చాడు....