భారతదేశం, నవంబర్ 6 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనా ఇంటికి వస్తారు. అమ్మమ్మ వెళ్లేవరకు ఏ గొడవ చేయరని మాటిచ్చారని మీనా అంటుంది. ఎక్కడికెళ్లారని రవి అడిగితే.. ప్రభావతి కడుపున పుట్టడం గురించి మాట్లాడుతాడు బాలు. ఇప్పటిదాకా ఎక్కడ ఊరేగావే అని ప్రభావతి అంటుంది.

నా ఇష్టం. నా మొగుడితో కలిసి ఎక్కడైనా ఊరేగుతా అని మీనా ఎదురుతిరుగుతుంది. వంట ఎవరు చేస్తారు అని ప్రభావతి అంటే.. మీకు చేతులు లేవా. మీకు చేతకాదా. నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా. నేను లేకుంటే దిక్కు లేదా అని మీనా వరుసపెట్టి వాయించేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

మనోజ్‌ను బెలూన్స్ ఊదమంటే బుగ్గలు నొప్పి పెడతాయ్ అని అంటాడు. అన్ని నొప్పి పెడతాయిరా నీకు అని బాలు బెలూన్ ఊది ఊది పగిలేలా చేస్తాడు. కాఫీ పెట్టమంటారా అని మీనా అడిగితే.. అగ్ని పర్వతాన్ని నీళ్లతో ఆపలేవని...