భారతదేశం, సెప్టెంబర్ 29 -- గుండె జబ్బులు అంటే చాలు... చాలా మందికి అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు (హార్ట్ ఎటాక్) మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ, వాస్తవానికి గుండె సమస్యలు అంత త్వరగా, అంత నాటకీయంగా దాడి చేయవు. అవి చాలా నెమ్మదిగా, నిశబ్దంగా మొదలవుతాయి. తరచుగా చిన్న చిన్న అసౌకర్యాలుగా, అస్వస్థతలుగా కనిపిస్తాయి. వీటిని చాలా మంది తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తారు. ఈ నెమ్మదైన పరిణామమే చాలా ప్రమాదకరం. ఎందుకంటే, కీలకమైన తొలి హెచ్చరిక సంకేతాలను గుర్తించకుండా వదిలేస్తే, పరిస్థితి చేయి దాటిపోతుంది.

గుండెకు పెద్ద సమస్య వచ్చే కనీసం ఆరు నెలల ముందు నుంచే మన శరీరం కొన్ని సూచనలను ఇవ్వడం మొదలుపెడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సంకేతాలను సకాలంలో గుర్తించగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్నారు.

ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి చె...