భారతదేశం, జనవరి 26 -- ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎండు మిర్చి ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉండటం, గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడం దీనికి కారణంగా కనిపిస్తుంది.

మిర్చి యార్డు అధికారుల ప్రకారం.. ప్రీమియం రకాల ధరలు గత సంవత్సరం కంటే 20 నుండి 25 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేవ్నూర్ ​​డీలక్స్ (డిడి) రకం క్వింటాలుకు రూ.25,000 వరకు లభిస్తుండగా, బ్యాడిగి రకం క్వింటాలుకు రూ.23,000 వరకు అమ్ముడవుతోంది.

341 రకం మిర్చి క్వింటాలుకు రూ.22,500కు చేరుకుంది. తేజా రకం క్వింటాలుకు రూ.20,500కు వచ్చింది. తాలు రకం క్వింటాలుకు రూ.11,000కు అమ్ముడవుతోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట...