భారతదేశం, జూన్ 3 -- భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడటంతో శాంతి చర్చల ఆశలు అడుగంటాయి. ఈ గ్లోబల్ పరిణామాలు దలాల్ స్ట్రీట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపేలా కనిపిస్తున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్ల మద్దతుతో వరుస నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లకు, నేడు అంతర్జాతీయ పరిస్థితులు సవాలుగా మారనున్నాయి.

గత సెషన్‌లో సెన్సెక్స్ 382.50 పాయింట్లు (0.52%) లాభపడి 74,649.84 వద్ద, నిఫ్టీ 50 సూచీ 100.95 పాయింట్లు (0.43%) పెరిగి 23,483.55 వద్ద ముగిశాయి.

సింగపూర్‌లోని గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుత ట్రేడింగ్‌లో 23,469 స్థాయిల వద్ద కొనసాగుతోంది. ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి ముగింపుతో పోలిస్త...