భారతదేశం, ఫిబ్రవరి 24 -- మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ.. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ ఉన్న ఇళ్లను కూల్చడం, స్థానికులను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం సరైన నిర్ణయం కాదని తుషార్ గాంధీ చెప్పుకొచ్చారు.

ఇలాంటి చర్యలు మహాత్మా గాంధీ ఆశయాలకు విరుద్ధమని తుషార్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ గాంధీ బతికి ఉంటే తన పేరు మీద, తన విగ్రహ నిర్మాణం కోసం ఇలాంటివి చేయెుద్దని చెప్పేవారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ గాంధీ విగ్రహం ఏర్పాటును వెంటనే ఆపాలని తుషార్ గాంధీ కోరారు.

మూసీ ఈసీ నదితో కలిసే చోట...