భారతదేశం, జూలై 27 -- YouTuber Anurag Dobhal Accuses Wife Ritika: యూట్యూబ్ ప్రపంచంలో 'UK07 రైడర్'గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ వ్లాగర్, యూట్యూబర్ అనురాగ్ దొభాల్ కుటుంబ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. తన సొంత కుటుంబం మానసికంగా వేధిస్తోందని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన అనురాగ్, ఇప్పుడు నేరుగా తన భార్య రితికా చౌహాన్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు.

తన గర్భధారణ సమయంలోనే భార్య రితిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి నమ్మకద్రోహం చేసిందని ఓ సుదీర్ఘమైన యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించారు అనురాగ్ దోభాల్. అనురాగ్ తన కొత్త వీడియోలో 'అన్నాథ్' (Annath) అనే పాటను విడుదల చేస్తూ, అది తన జీవిత నిజ కథ అని చెప్పారు. రితిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఉన్న దృశ్యాలను, చాటింగ్ స్క్రీన్‌షాట్లను ఆయన బయటపెట్టారు.

"ఆమె నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది. గర్భవత...