భారతదేశం, నవంబర్ 14 -- జ్యోతిష్య శాస్త్రంలో కర్మఫల దాతగా, న్యాయదేవతగా పిలిచే శనిదేవుడి గమనంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. సుమారు నాలుగున్నర నెలలుగా తిరోగమన (వక్ర) స్థితిలో సంచరిస్తున్న శని గ్రహం త్వరలోనే ప్రత్యక్ష (మార్గ) గమనంలోకి రానుంది.

డిసెంబర్ 11న మీన రాశిలోనే శని తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ గ్రహ కదలికకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. శని గమనంలో వచ్చే ఈ మార్పు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితంలో కీలక పరిణామాలకు దారితీస్తుందని జ్యోతిష్య పండితులు విశ్వసిస్తున్నారు.

ముఖ్యంగా ప్రస్తుతం మేషం, కుంభం, మీన రాశుల వారికి ఏలినాటి శని నడుస్తోంది. మరోవైపు సింహ, ధనుస్సు రాశుల వారు అర్ధాష్టమ, అష్టమ శని (ధయ్యా) ప్రభావంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో శని ప్రత్యక్ష గమనంలోకి రావడం ఈ ఐదు రాశుల వారికి అత్యంత కీలకం...