భారతదేశం, సెప్టెంబర్ 23 -- హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో నవరాత్రుల పాటు పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ చెరువుల వద్దకు చేరుకుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిమజ్జన శోభాయాత్రలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనం రోజుల్లో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ (MMTS) రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబరు 25-26, సెప్టెంబరు 26-27 తేదీల మధ్య రాత్రి 11:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 05:00 గంటల వరకు ఈ ప్రత్యేక ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు అందుబాటులో ఉ...