భారతదేశం, సెప్టెంబర్ 14 -- హిందూ సంప్రదాయంలో గణేష్ చతుర్థిని అత్యంత వైభవంగా జరుపుకునే ప్రధాన పండుగగా భావిస్తారు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ప్రారంభమయ్యే ఈ గణేషోత్సవం అనంత చతుర్దశి వరకు ఘనంగా సాగుతుంది. ఈ పది రోజుల పాటు ఇళ్లలోనూ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా పందిళ్లలోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్టించి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు. వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది సెప్టెంబర్ 14, 2026 సోమవారం రోజున గణేష్ చతుర్థి పర్వదినం వచ్చింది. ఈ పూజా కార్యక్రమంలో గణపతికి గరిక సమర్పించే ఆచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

దైవిక పూజా విధానంలో భగవానుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఆ కోవలోనే...