భారతదేశం, సెప్టెంబర్ 14 -- వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. దిల్లీలో జరిగిన BLTM(బిజినెస్ లీజర్ ట్రావెల్ అండ్ ఎగ్జిబిషన్) 2025లో గండికోట 'మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్' అవార్డును గెలుచుకుంది. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ ఆఫీసర్ పద్మారాణి ఈ అవార్డును అందుకున్నారు.

శుక్రవారం నుండి ఆదివారం వరకు యశోభూమి, ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఐఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ వారసత్వ ప్రదేశాలు, సహజమైన బీచ్ గమ్యస్థానాలు, గ్రామీణ పర్యాటక అనుభవాలు, పర్యావరణ-పర్యాటక చొరవలను ప్రదర్శించారు. గండికోటకు ఐసీఆర్టీ(ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం), భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో బాధ్యతాయుతమైన పర్యాటక అవార్డులు విభాగంలో అవార్డును అందుకుంది. గండికోటకు జాత...