భారతదేశం, ఆగస్టు 18 -- కేరళలోని త్రిస్సూర్‌లో 65 కిలోమీటర్ల హైవేను కవర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకుంటే వాహనదారుడు రూ.150 టోల్ చెల్లించాలని ఎందుకు అడగాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. త్రిస్సూర్‌లోని పాలియెక్కర టోల్ ప్లాజా వద్ద టోల్ వసూళ్లను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, కన్సెషనర్ గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

కాస్త దూరానికి వెళ్లడానికి 12 గంటల సమయం పడుతుంటే రూ.150 ఎందుకు చెల్లించాలి? అని సుప్రీం కోర్టు అడిగింది. గంట సమయం పట్టే దారికి.. మరో 11 గంటల సమయం పడుత...