భారతదేశం, ఆగస్టు 13 -- ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (AI2379) ఎయిర్‌బస్ A320 విమానం ఆగస్టు 4న గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై AAIB అధికారులు విమాన కెప్టెన్‌ను గంటకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైద్య పరీక్షల్లో సదరు పైలట్ గంజాయి వాడినట్లు పాజిటివ్‌గా తేలడం సంచలనం సృష్టించింది.

విచారణ సమయంలో పైలట్ తన వ్యక్తిగత సమస్యల కారణంతో తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్నానని తెలిపాడు. ఫుకెట్ లేఓవర్ సమయంలోనూ నిద్ర పట్టకపోవడంతో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన మందులు వాడినట్లు పేర్కొన్నాడు. అయితే డిజిసిఎ (DGCA) నిబంధనల ప్రకారం పైలట్లు ఏవైనా వైద్యుల మందులు వాడుతుంటే ఆ విషయాన్ని ముందే తమ విమానయాన సంస్థకు తెలియజేయాలి. ఈ పైలట్ ఆ వివరాలను యాజమాన్యానికి వెల్లడించలేదని తెలుస్తోంది.

ప్రయా...