భారతదేశం, ఆగస్టు 24 -- విజయవాడ నగరంలో గంజాయి విక్రయాలు, వాడకంపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మాదకద్రవ్యాల మూలాలను మట్టుబెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్, ఈగల్ విభాగం సంయుక్తంగా 'ఈగల్ ఛాలెంజ్' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అజిత్ సింగ్ నగర్‌లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పాల్గొని కీలక వివరాలు వెల్లడించారు.

గంజాయిని నగరానికి తీసుకువచ్చినా లేదా విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం అందిస్తే రూ.5,000 నగదు పారితోషికం అందిస్తారు. గంజాయి తాగుతున్న వారి వివరాలు తెలిపిన వారికి రూ.1,500 రివార్డు ఇస్తారు.

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల 469 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ వచ్చింది. గంజాయి తాగే 129వ వ్యక్తిని పట్టించి చూపించిన వారి...