భారతదేశం, మే 31 -- గోదావరి డెల్టా పరిధిలోని రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ సాగు పనులను ముందస్తుగానే ప్రారంభించేందుకు వీలుగా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుండి గోదావరి నీటిని విడుదల చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గోదావరి డెల్టా ప్రజాప్రతినిధులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

ఈ ముందస్తు నీటి విడుదల, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా విడుదల చేసిన ఈ నీరు గోదావరి డెల్టా పరిధిలోని 2.63 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు అందనుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముందస్తు ఖరీఫ్ పనులను సజావుగా సాగించేందుకు రైతులు నీటిని పొదుపుగా, సమర్థవ...