భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఈ ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రానికి 200,000 టన్నుల యూరియాను సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌ను అధికారికంగా అభ్యర్థించారు. కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. దిగుమతి చేసుకున్న ఎరువులపై రైతులు ఎక్కువగా ఆధారపడటం వల్ల ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తిచూపారు.

ఎరువుల విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను సమావేశం చెప్పామని మంత్రి తుమ్మల తెలిపారు. అధికంగా దిగుమతులపై ఆధారపడటమే సమస్యకు కారణమన్నారు. రైతులకు సాయం చేసే విషయంపై చాలాసేపు చర్చించినట్టుగా వెల్లడించారు. 'ప్రత్యేకంగా 1968లో తయారుచేసిన విత్తన చట్టానికి అప్డేట్స్ చేయాల్సి ఉంది. రైతులకు మద్దతు ఇవ్వడానికి తదుపరి పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాన్ని రూపొందించాలని కోరాం.' అని మంత్రి తుమ్మల వెల్...