భారతదేశం, సెప్టెంబర్ 14 -- కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ క్రాప్ ఏరియా సోన్ (ఖరీఫ్) నివేదిక దేశంలో పంటల సాగు స్థితిగతులను వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,279.66 లక్షల హెక్టార్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ, వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం, నేలలో తేమ శాతం, పంటల మార్కెట్ ధరలు, స్థానిక వాతావరణ పరిస్థితులు రైతుల సాగు నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ నివేదికపై పారిజాత్ ఇండస్ట్రీస్ (డొమెస్టిక్ బిజినెస్) సీఈఓ ఉదయ్ రాజ్ ఆనంద్ స్పందిస్తూ రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

"ఖరీఫ్ సీజన్ ప్రస్తుత దశలో సాగు విస్తీర్ణం కన్నా పొలంలో ఉన్న పంట దిగుబడి సామర్థ్యాన్ని కాపాడుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి" అని పారిజాత్ ఇండస్ట్రీస్ డొమెస...