భారతదేశం, జూన్ 11 -- ఖమ్మం నగరంలో గుండెల్ని పిండేసే అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అపార్ట్‌మెంట్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేసాడు ఒక కిరాతకుడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తోంది. ఆ కుటుంబంలో మైనర్ బాలిక ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసిన నిందితుడు మహ్మద్ గౌస్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, ఆమె ఈ విషయాన్ని ఎవరికైనా చ...