భారతదేశం, మార్చి 19 -- దోహా/వాషింగ్టన్: ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేసే వార్త ఇది. మార్చి 19, గురువారం తెల్లవారుజామున ఖతార్‌లోని అత్యంత కీలకమైన 'రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ'పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ప్రపంచ దేశాలకు గ్యాస్ సరఫరా చేసే ఈ కేంద్రంపై దాడి జరగడం అంతర్జాతీయంగా పెను ఆందోళనకు దారితీసింది.

ఖతార్ ఎనర్జీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన దాడుల కొనసాగింపుగా, గురువారం తెల్లవారుజామున కూడా ఇరాన్ పలు క్షిపణులను ప్రయోగించింది. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్లు, పెరల్ గ్యాస్-టు-లిక్విడ్స్ (GTL) కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగగా, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.

ఇది ముమ్మాటికీ 'ప్రతీకార దాడి' అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన...