భారతదేశం, ఫిబ్రవరి 25 -- సాయంత్రం 5 గంటలవుతోంది. మీ బాస్ అర్జెంట్‌గా ఒక పది పేజీల రిపోర్ట్ పంపి, "దీని సారాంశం తీసి, ఎక్సెల్ షీట్‌లో డేటా వేసి, క్లయింట్‌కి మెయిల్ డ్రాఫ్ట్ చేయి" అని చెప్పారు. సాధారణంగా అయితే ఈ పనికి కనీసం రెండు గంటలు పడుతుంది. కానీ, అదే పనిని ఒక డిజిటల్ అసిస్టెంట్ కేవలం రెండు నిమిషాల్లో, ఎక్కడా తప్పు లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది కదూ! కానీ, ఇప్పుడు ఇది పక్కా రియాలిటీ.

ఈ మధ్య వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఒక సంఘటన టెక్ వర్గాలకు చెమట్లు పట్టించింది. 'Claude Cowork' అనే టూల్ మార్కెట్లోకి వచ్చిన దెబ్బకు.. దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో రారాజులుగా వెలుగుతున్న Salesforce, ServiceNow వంటి దిగ్గజ సంస్థల షేర్లు ఒక్కసారిగా 20 నుంచి 33 శాతం పడిపోయాయి. ఇది కేవలం టెక్ కంపెనీలకు సంబంధించిన విషయం కాదు...