భారతదేశం, మే 26 -- ఇటీవల కాలంలో చాలామందికి ఒక అనుభవం ఎదురవుతోంది. హఠాత్తుగా ఫోన్‌కు ఒక ఎస్ఎంఎస్ (SMS) వస్తుంది. "మీ క్రెడిట్ రిపోర్ట్‌పై ఒక ఎంక్వైరీ జరిగింది" అని దాని సారాంశం. వెంటనే ఇమెయిల్ కూడా వస్తుంది. మీరు ఏదైనా లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇలాంటి మెసేజ్‌లు రావడం సహజం. కానీ, ఏ దరఖాస్తు చేయనప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ వస్తే మాత్రం గుండె ఆగినంత పనవుతుంది. "నా అనుమతి లేకుండా నా రిపోర్ట్‌ను ఎవరు చూశారు? దీనివల్ల నా సిబిల్ (CIBIL) స్కోర్ పడిపోతుందా?" అనే అనుమానాలు మొదలవుతాయి.

నేడు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ మయమయ్యాయి. ఒక క్రెడిట్ కార్డ్ కావాలన్నా, పర్సనల్ లోన్ కావాలన్నా, చివరకు ఆన్‌లైన్‌లో వస్తువులు కొని వాయిదాల పద్ధతిలో (EMI) చెల్లించాలన్నా అన్నీ నిమిషాల్లో జరిగిపోతున్నాయి. ఈ సులభతర ప్రక్రియ వెనుక బ్యాంకులు మ...