భారతదేశం, ఆగస్టు 11 -- క్రెడిట్ కార్డ్ వాడే చాలామందికి ప్రతి నెలా బిల్లు రాగానే ఒకే లక్ష్యం ఉంటుంది.. బిల్లు సమయానికి చెల్లించి సిబిల్ స్కోర్ (CIBIL Score) కాపాడుకోవడం. అయితే బిల్లు చెల్లింపుల సమయంలో కనిపించే 'మినిమం అమౌంట్ డ్యూ' ఆప్షన్ వెనుక ఉన్న పెద్ద ప్రమాదాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఇది చాలదన్నట్లు, కొన్ని బ్యాంకులలో ఆటోపే సెట్టింగ్స్ దానంతట అవే 'మినిమం డ్యూ'కి మారిపోతుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

బెంగళూరుకు చెందిన ఐటీ కన్సల్టెంట్ రాఘవేంద్ర అనుభవమే దీనికి నిదర్శనం. ఆయన తన క్రెడిట్ కార్డ్ బిల్లును ప్రతి నెలా ఆటోపే ద్వారా 'పూర్తి మొత్తం' (Full Amount Due) చెల్లించేలా సెట్ చేసుకున్నారు. కానీ, సిస్టమ్ బ్యాకెండ్‌లో ఆ ఆప్షన్ 'మినిమం డ్యూ'కి మారిపోయింది. ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు పడుతుండటాన్ని గమనించిన ఆయన, బ్యాం...