భారతదేశం, మే 22 -- పండుగ సీజన్ సేల్స్ లేదా అనుకోని ఖర్చుల వల్ల క్రెడిట్ కార్డ్ బిల్లు ఒక్కోసారి మన బడ్జెట్‌ను దాటిపోతుంటుంది. అటువంటప్పుడు రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి.. కేవలం 'కనీస మొత్తం' (Minimum Due) చెల్లించడం. రెండు.. ఆ బకాయిని నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోవడం. ఈ రెండింటిలో ఏది ఉత్తమం? ఏది మీ జేబుకు చిల్లు పెడుతుంది? దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

"అప్పు చేసి పప్పు కూడు" తింటే పర్లేదు కానీ, ఆ అప్పు తీర్చే పద్ధతి తెలియకపోతేనే అసలైన తిప్పలు మొదలవుతాయి. ముఖ్యంగా మినిమమ్ డ్యూ చెల్లించడం అనేది ఒక రకంగా అప్పుల ఊబిలోకి వెళ్లడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు చేసే అతిపెద్ద పొరపాటు మినిమమ్ అమౌంట్ చెల్లించడం. మీరు మినిమమ్ డ్యూ కట్టినప్పుడు బ్యాంకులు మీపై 'డిఫాల్టర్' ముద్ర వేయవు నిజమ...