భారతదేశం, నవంబర్ 16 -- చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. అవసరమైనప్పుడు ఖర్చు చేసే వెసులుబాటు, సౌకర్యం దొరుకుతాయి. అయితే బిల్లు కట్టే సమయం వచ్చినప్పుడు పూర్తి మొత్తం కాకుండా కేవలం 'మినిమమ్ అమౌంట్ డ్యూ' (కనీస చెల్లింపు మొత్తం) కట్టి చేతులు దులుపుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. తాత్కాలికంగా నగదు ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు ఇది సులువైన మార్గంగా కనిపించినా, దీర్ఘకాలంలో మిమ్మల్ని తీవ్రమైన అప్పుల ఊబిలోకి నెట్టి ఆర్థికంగా కుంగదీస్తుంది.

నిజానికి మినిమమ్ డ్యూ కట్టడం వల్ల ఆలస్య రుసుము (లేట్ పేమెంట్ ఛార్జీలు) తప్పించుకోవచ్చు. మీ ఖాతా గడువు మీరినట్లు (ఓవర్‌డ్యూ) నమోదు కాకుండా కాపాడుకోవచ్చు. కానీ దీనివల్ల మీ అసలు బకాయి మొత్తం ఏమాత్రం తగ్గదు. సాధారణంగా మొత్తం బిల్లులో దాదాపు 5 శాతాన్ని మినిమమ్ డ్యూగా నిర్ణయిస్తారు. అయితే కార్డు జారీ చేసే బ్యాంకుల...