భారతదేశం, మార్చి 30 -- అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలు భగ్గుమనడం, అమెరికా డాలర్ బలోపేతం కావడంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. సోమవారం (మార్చి 30) నాడు దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగానూ బులియన్ మార్కెట్‌లో ధరల పతనం స్పష్టంగా కనిపించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం మదుపరుల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మార్కెట్‌లో వెండి ధర 0.5 శాతం తగ్గి కిలో రూ. 2,26,798 వద్ద ముగిసింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర 1.5 శాతం క్షీణించి రూ. 1,42,100 గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చూస్తే, స్పాట్ సిల్వర్ ధర 1.3 శాతం క్షీణించి ఔన్స్‌కు 68.67 డాలర్లకు పడిపోయింది. స్పాట్ గోల్డ్ కూడా 0.6 శాతం తగ్గి ఔన్స్‌కు 4,466.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.