భారతదేశం, మార్చి 10 -- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్లమెంట్ పట్ల 'సీరియస్‌నెస్' లేదని కిరణ్ రిజిజు విమర్శించారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన హిందీలో మాట్లాడుతూ.. "ప్రధానిని కౌగిలించుకుని, తిరిగి తన సీటులోకి వచ్చి తోటి ఎంపీలకు కన్ను కొట్టే (ఆంఖ్ మార్తా హై) నేతను నేనెప్పుడూ చూడలేదు" అని వ్యాఖ్యానించారు.

రిజిజు ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో అటు రాహుల్ గాంధీ గానీ, ఇటు ప్రధాని మోదీ గానీ సభలో లేరు. 2018లో జరిగిన అవిశ్వాస తీర్మానం సమయంలో రాహుల్ గాంధీ నాటకీయంగా ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి కౌగిలించుకుని, ఆ తర్వాత తన స్థానంలో కూర్చుని కన్ను కొట్టారు. నాటి ఘటనను రిజిజు ఇప్పుడు మరోసారి ప్రస్తావించగా, అప్పట్లో బీజేపీ దీనిని 'పిల్ల చేష్ట'గా అభివర్ణించింది.

రిజిజు ప్రసంగం ముగిసిన వెంటనే రాహుల్ సోదరి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. "గ...