భారతదేశం, ఫిబ్రవరి 24 -- 'కోర్టు' సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్యాండ్ మేళం'. మంగళవారం (ఫిబ్రవరి 24) విడుదలైన ఈ సినిమా టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది. మార్చి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి టీజర్ ఎలా ఉంది? ఈ మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవి.. ఈ పేరు వినగానే 'కోర్టు' సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ గుర్తుకు వస్తుంది. గతేడాది ఈ లోబడ్జెట్ సినిమాతో ఈ జంట మంచి హిట్ కొట్టింది. తన అమాయకపు నవ్వుతో శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణంలో వస్తున్న 'బ్యాండ్ మేళం' మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజ...