Telangana,sirpur, సెప్టెంబర్ 26 -- తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతోంది. వారిపై వేటు వేసే అన్నిమార్గాలను అన్వేషిస్తూ న్యాయపోరాటం చేస్తోంది. ఇదిలా ఉంటే.. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు వెంటనే కండువా మార్చేశారు. అయితే వీరిలో కొందరు నేతలు. అధికార కాంగ్రెస్ లో అడ్జెస్ట్ కాలేక. ఘర్ వాపసీ అంటున్నారు.

బీఆర్ఎస్ హయాంలో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ్నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప. ఓడిపోయారు. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా ఓడిపోగా. క...